వోటర్ ఐడీ లో కుక్క ఫోటో..!

post

వోటర్ ఐడీ లో సాధారణంగా మనుషుల పేర్లు,  గ్రామాలు/పట్టణాల పేర్లు తప్పుగా వస్తుంటాయి. అయితే బెంగాల్లోని ఒక ఓటర్ ఐడీ లో మనిషి ఫోటోకు బదులు కుక్క ఫోటో రావడం సంచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్లోని రామ్ నగర్ కు చెందిన సునీల్ కర్మాకర్ తన ఓటర్ ఐడీలో తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సవరణల తరువాత కొత్త ఓటర్ ఐడీ తీసుకున్న సునీల్ అందులో తన ఫోటోకు బదులు కుక్క ఫోటో చూసి షాక్ కు గురయ్యాడు. అయితే ఇది పొరపాటుగా జరిగిందని సవరణల తరువాత కొత్త ఓటర్ ఐడీని సునీల్ కు అందజేస్తామని బ్లాడ్ డెవలప్ మెంట్ అధికారి తెలిపారు.