18 రోజుల్లో యుద్ధాన్నే ముగించారు..21 రోజుల్లో కరోనా ను జయించలేరా..?

post

కరోనా మహమ్మారి మాటు వేసిన వేళా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపధ్యం లో ఆయన వారితో కరోనా వైరస్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ పాటించడం గురించి ఆయన స్పందించారు. వారణాసి వారిని ఉద్దేశించి మహాభారత యుద్ధాన్నే పద్దెనిమిది రోజుల్లో ముగించారు. ఓ ఇరవై ఒక్క రోజుల్లో కరోనా మహమ్మారిని  జయించలేమా..? అని అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని అన్నారు.  మీరు ఇంట్లోనే ఉండండి. మీరు జాగ్రత గా ఉంది దేశాన్నే కాపాడండి అని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉంది కరోనా ని తరిమి తరిమి కొడదామని ఆయన పిలుపునిచ్చారు. 
     ఆయన ఇంకా మాట్లాడుతూ, వైరస్ పట్ల ప్రభుత్వం అప్రమత్తం గా ఉందని, అన్ని చర్యలు తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఏమైనా సందేహాలు ఉన్నవారు 9013151515 నంబరు కు వాట్సాప్ లో సంప్రదించమని కోరారు. ఐకమత్యం తో కరోనా ను ఎదుర్కొందామని ఆయన ఉత్సాహపరిచారు. సోషల్ డిసన్స్ ను మన అలవాటు గా మార్చుకోవాలని ఈ నేపధ్యం లో ఆయన చెప్పుకొచ్చారు. వైరస్ సోకినా వారికి సేవలు చేస్తున్న పారా మెడికల్ స్టాఫ్ కు, డాక్టర్లకు, నర్సులకు, ఇతర అత్యవసర విభాగాలలో పని చేస్తున్నవారికి మనం కృతజ్ఞత తెలపాలని చెప్పుకొచ్చారు. వారందరికీ భారం కారాదన్నారు. అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ..ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఒకే త్రాటి పై నడవాలని అన్నారు. మనందరికీ ఇల్లే కేరాఫ్ అడ్రస్ కావాలని ఆయన ఈ సందర్భం గా సూచించారు.