అమెరికా 2 ట్రిలియన్ల డాలర్ల ప్యాకేజీ..!

post

కరోనా మహమ్మారి అమెరికాను ముప్పతిప్పలు పెడుతోంది. ఇటలీ తరువాత, అక్కడ కూడా రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. దీనితో అమెరికా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యం లో అమెరికా ప్రజలకు ట్రంప్ ఊరట ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో ట్రంప్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ విపత్కర పరిస్థితిల్లో ట్రంప్ ప్రభుత్వం సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల ఉద్దేపన ప్యాకేజీ ఇవ్వడానికి సేనేటర్లు, వైట్‌హౌజ్ అధికారులు సిద్ధపడుతున్నారు. 
         ముఖ్యం గా వ్యాపారాలు చేసుకునే వారికి, కార్మికులకు, వైద్యసిబ్బందికి మొదలైన వారికి ఈ ప్యాకేజీ అందనుంది.కరోనా వైరస్ వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నవారికి ఈ ప్యాకేజి వరం గా  మారుతోంది. వీరికి ప్యాకేజీ నుంచి నేరుగా వారి ఖాతాలోకి వెళ్తుంది. అమెరికా చరిత్ర లోనే ఇది అతి పెద్ద ప్యాకేజీ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక వ్యక్తికి ప్యాకేజీ కింద 1200 డాలర్లు ఇస్తారు. ప్రతి ఒక చిన్నారికి 500 డాలర్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం జరిగింది. అమెరికా లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ సొమ్ము అందుతుంది అని అన్నారు.