ప్రాణం తీసిన ట్రంప్ సలహా..!

post

ట్రంప్ ఏదో సలహా ఇచ్చారని ఓ దంపతులు క్లోరోక్విన్ ను మింగారు. కరోనా తగ్గడం సంగతి ఏమో గాని..వారిద్దరూ కొద్దీ సేపటికి స్పృహ తప్పారు. ఇది చూసిన స్థానికులు వెంటనే వారిద్దరిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతుండగానే, భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య చావు బతుకుల్లో కొట్టుమిట్టాడు తోంది. వివరాల్లోకెళితే, అరిజోనా కి చెందిన దంపతులు టీవిలో వచ్చిన ట్రంప్ ఇంటర్వ్యూ చూసి అందులో, కరోనా కు విరుగుడు గా క్లోరోక్విన్ పై పరిశోధనలు సాగుతున్నాయని మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పడం విన్నారు. కరోనా భయం తో, అది తమకు రాకుండా ఉండాలని వారిద్దరూ ఇంట్లోని చేపల తొట్టిని క్లీన్ చేసే క్లోరోక్విన్ టాబ్లెట్ లను మింగారు. దీనితో పరిస్థితి అదుపుతప్పి మరణానికి బలి కావాల్సి వచ్చింది. 
         కరోనా వైరస్ ను అరికట్టేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ల కలయికలో రానున్న కొత్త ఔషధాలు తోడ్పడుతాయన్న ఉద్దేశం తో క్లోరోక్విన్ ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ఇది ఆ దంపతుల ప్రాణానికే ప్రమాదం గా మారింది. బ్యానర్ హెల్త్ నిపుణులు సైతం కరోనా ను కట్టడి చేసేందుకు ట్యాబ్లెట్లు లేదా ఇంట్లో వినియోగించే రసాయనాల్ని తీసుకోకూడదని ప్రజలకు సూచించారు.