ఇప్పటిదాకా ఇండియా ఓకే.. తేడా వస్తే మాత్రం అంతే..!

post


కరోనా మహమ్మారి ప్రస్తుతం ఇండియా లో రెండవ దశ లో ఉంది. ఈ దశ దాటి విస్తరించడం ప్రారంభిస్తే, కట్టడి చేయడం మన దేశం లో సాధ్యం కాదు. అందుకే మోడీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. త్వరిత గతిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే, కట్టడి చేసే విషయం పై ప్రభుత్వం మన వైపు చూస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు, పడుతున్న కృషి ప్రశంసనీయమని మేధావులు  అంటున్నారు. కానీ, పరీక్షలు నిర్వహించే విషయం లో మాత్రం కొంత వెనకడుగులో ఉంది. ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు  కేవలం పదకొండువేల పైచిలుకు పరీక్షలు మాత్రమే ప్రభుత్వం నిర్వహించింది.
   పరిస్థితి ఇప్పుడున్నట్లుగానే ఉంటె, మే రెండోవారానికి కేసులు పదమూడు లక్షలు దాటే అవకాశం ఉంది. వాక్సిన్ దొరకని కరోనాను ఈ దశలో అణచివేయలేకపోతే, తరువాతి దశలలో భారత్ లో అదుపు చేయడం కష్టం గా ఉంటుంది. ముందు ముందు..ఇండియా లో పరిస్థితి దారుణాతి దారుణం గా మారుతుంది. ఇప్పటికే, యుఎస్, ఇటలీ దేశాల్లో కరోనా ఉధృతి రెండవ దశ దాటి విస్పోటనం దిశగా కొనసాగుతోంది. ఇండియా లో కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. అవి రెండు అభివృద్ధి చెందిన దేశాలు. ఇదే పరిస్థితి ఇండియా లో ఎదురైతే, ఇక్కడి జనాభా కు సరిపోయే పడకలు కూడా లేవు. ఇక్కడ పదివేల మందికి ఏడూ పడకలు మాత్రమే ఉన్నాయని ఓ అంచనా. అందుకే ఇండియా ఈ దశ లో మరింత జాగ్రత్తగా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు.