చైనా తరువాత ఇటలీ లోనే ఎక్కువ..!

post

కొవిడ్ వైరస్ విజృంభణతో ఇటలీ విలవిలాడుతోంది. చైనా ఆవల కొవిడ్ దెబ్బకు ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఇటలీ ఉంది. ఈ వైరస్ వ్యాప్తితో ఉత్తర ఇటలీలోని లొంబార్టీ, ఆర్థిక రాజధాని మిలాన్‌, వెనిస్‌, మరో పద్నాలుగు ప్రాంతాలను క్వారంటైన్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ జోన్‌లో నివసిస్తున్న 1.6 కోట్ల మంది అంటే ..... మొత్తం జనాభాలో నాల్గోవంతు మందిని...  కొత్తగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ జోన్‌కు ఇటలీ ప్రభుత్వం పంపింది.. ఈ మేరకు ఎమర్జన్సీ డిక్రీని జారీ చేసింది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రమైన చర్యలు చేపట్టింది సర్కార్. 
లొంబార్టీ, పరిసర ప్రాంత ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రధాని గుసిప్పె కాంటీ డిక్రీ జారీ చేశారు.  గడిచిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 1,247 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో ప్రధాని ఈ చర్య తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే ఈ వైరస్ తో 36 మంది మరణించారు. దీంతో ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య 233కు చేరింది.   6వేల మంది బాధితులున్నారని తెలిపింది. 

కొవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు వెనిస్‌, మిలాన్‌తో సహా విస్తారమైన ప్రాంతంలో ప్రజల కదలికలను నియంత్రిస్తున్నామని ఇటలీ ప్రధాని గిసెప్పె కాంటె చెప్పారు. ఈ కొత్త చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలిపారు. క్వారంటైన్‌ చర్యలు చేపడుతున్న జోన్‌ ఆరంజ్‌ జోన్‌గా గుర్తించారు. మరో ఏడు ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఆరంజ్‌ జోన్‌లో ఉండే ప్రాంతంలో కఠినమైన చర్యలు అమలు చేస్తారు. మిగతా జోన్‌లలో పరిస్థితి తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయి. ఏ వ్యక్తి కైనా 35.7 డిగ్రీల సెల్సియష్‌ టెంపరేచర్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వంటి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే క్వారంటైన్‌ జోన్‌కు పంపిస్తారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని స్కూళ్లు, యూనివర్సిటీలు, మ్యూజియంలు, నైట్‌ క్లబ్‌లు బింగో హాల్స్‌, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలను మూసివేశారు. వివాహ వేడుకలు, అంతిమయాత్రలు వంటి వాటిని నిషేధించారు. చర్చిలు తెరచి వుంచినా వ్యక్తుల మధ్య తగినంత దూరం ఉండేలా చూస్తున్నారు. బార్లు, రెస్టారెంట్ల వద్ద కూడా ఇదే విధమైన నిబంధనలు పెట్టారు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఉండాలని.. ఈ నిబంధనలను అతిక్రమిస్తే మూడు నెలల పాటు జైలు శిక్ష లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని  అధికారులు హెచ్చరించారు.