దుర్గావతి గా వస్తున్నా భాగమతి..!

post


అనుష్క ప్రధాన నాయికా గా రూపొందిన లేడి ఓరియేంటేడ్ చిత్రం "భాగమతి". ఇది ఆమె కెరీర్ లోనే కీలకమైనది గా నిలిచింది. తెలుగునాట, ఈ చిత్రం మంచి పేరునే సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ లో జి.అశోక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ మంచి విజయాన్నే మూటగట్టుకుంది. దానితో, ఈ చిత్రాన్ని హిందీ లో కూడా రీమేక్ చేయాలనీ అశోక్ సంకల్పించారు. అనుష్క పాత్ర కోసం హిందీలో భూమి పెడ్నేకర్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. 
   భాగమతి హిందీ  రీమేక్ కు "దుర్గావతి" అని నామకరణం చేసారు. ఈ చిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కాగా, అక్షయ్ కుమార్ కూడా భాగస్వామ్య నిర్మాత గా ఉన్నారు. ఈ చిత్రం కధ మొత్తం ప్రధాన నాయకి పాత్ర చుట్టూనే ఉంటుంది. దీనివల్ల నటనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే భూమి పెడ్నేకర్ కూడా ఈ చిత్రం తన కెరీర్ కు హెల్ప్ అవుతుంది అని అనుకుంటోంది.