ఉగాది సందర్భం గా ఆర్ ఆర్ ఆర్ కొత్త ట్వీట్..!

post

రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్ర నిర్మాణం గురించి అనౌన్స్ చేసినప్పటినుంచి భారీగా అంచనాలు పెరిగాయి. సహజం గానే రాజమౌళి సినిమా అంటే ఓ కొత్త మేజిక్ ఎదో ఉంటుంది అని అందరు ఎదురు చూస్తారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రం పై ఎలాంటి  అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. 
      తాజాగా, ఉగాది సందర్భం గా ఆర్ ఆర్ ఆర్ చిత్ర టీం శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేసింది. 'ఎదురు చూపులు ముగిశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నాం' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ల  కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. కరోనా ఓ వైపు ముంచుకొచ్చిన తరుణం లో ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ తరుణం లో నే , మోషన్ పోస్టర్ ను, టైటిల్ ను విడుదల చేస్తున్నారు.