ఆగష్టు లో "ఎఫ్ 3 "..!

post

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2 ' సినిమా మంచి ఫామిలీ ఎంటర్టైనర్ గా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐతే, దీనికి సీక్వెల్ గా  "ఎఫ్ 3 " సినిమాను  తెరకెక్కించబోతున్నట్లు ఎపుడో ప్రకటించారు. కాగా, ప్రస్తుతం షూటింగ్ వాయిదా లో పడింది. 'దిల్' రాజు నిర్మాణంలో .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ఎఫ్ 2' సినిమా అప్పట్లో మంచి పేరే కొట్టేసింది. తాజాగా రాబోయే సీక్వెల్ పై కూడా భారీస్థాయి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ పై అనిల్ రావిపూడి కసరత్తు చేస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు సీక్వెల్ లోను కొనసాగనున్నారు. కథానాయికలను ఇంకా ఎంచుకోలేదని తెలుస్తోంది. ఈ విషయం లో ఇప్పటికి స్పష్టత రాలేదు. కాగా, ఈ సినిమా ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.