ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి..!

post

రేపు తెలుగువారి పండుగ ఉగాది అని అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యం లో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఆక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనితో, ఆయన ఇంస్టాగ్రామ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే ఆయనకు వెరిఫికేషన్ మార్క్ కూడా లభించడం గమనార్హం. ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చిన తరువాత ఆయన కేవలం ఒక పోస్ట్ మాత్రమే పెట్టారు. ప్రొఫైల్ ఫోటో ను మాత్రం అప్డేట్ చేసారు. అంతే..కుప్పలు తెప్పలు లైకులు.. ఫాలోవర్ల ప్రభంజనం మొదలైంది. మెగాస్టార్ ఎంట్రీనే ఇలా ఉంది అంటే..ఇక ఆయన ఆక్టివ్ లో ఉంటె ఇంకెలా ఉంటుందో చూడాల్సిందే. 'చిరంజీవి కొణిదెల' అనే పేరుతొ ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకున్న చిరు  ఒక్క పోస్టు వేల లైకులు పొందగా, చిరు 2.62 లక్షల మంది ఫాలోవర్లను పొందారు. ప్రొఫైల్ ప్రారంభించిన కొద్దీ సేపటికే ఆయనకు వెరిఫికేషన్ మార్క్ కూడా లభించింది. కాగా, రేపు ఉగాది సందర్భం గా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో లైవ్ లోకి రానున్నారు.