రజినీకాంత్, విజయ్ సేతుపతి ల విరాళం..!

post

కరోనా మహమ్మారి దేశం లో అల్లకల్లోలాన్ని సృష్టించింది.  దీనితో, అన్ని పనులు నిలిచిపోయాయి. దేశం స్తంభించిపోయింది.సినిమాల షూటింగ్లు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐతే, సినీ పరిశ్రమపై ఆధారపడ్డ శ్రమ జీవులకు, రోజు కూలీలకు అన్నానికి గండిపడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబాలకు ఉపాధి కరువైంది. వీరికోసం ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు విరాళం ప్రకటించారు. తాజాగా, సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా వీరికోసం విరాళాన్ని ప్రకటించారు. 
           తాజాగా, తలైవా రజినీకాంత్ దక్షిణ భారత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు యాభైలక్షల విరాళాన్ని అందచేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయనతో పాటుగా, విజయ్ సేతుపతి కూడా మరో పది లక్షల విరాళాన్ని అందించారు. ఇప్పటికే సూర్య కుటుంబం ఈ ఫెడరేషన్ కు పది లక్షల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ముంచుకొస్తున్న ముప్పు వారి జీవితాలలో విషాదం నింపుతోంది. సినీ తారలు ఒక్కొక్కరు దిగివచ్చి తమ దాతృత్వాన్ని చాటుతూ, వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు.