పవన్ కళ్యాణ్ తో మరోసారి..?

post

పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా నటించిన జల్సా సినిమా అప్పట్లో భారీ లాభాలే తెచ్చిపెట్టింది. వారిద్దరి జంట కి కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే, ప్రస్తుతం వకీల్ సాబ్ కోసం ఈ జంట మళ్ళీ జోడి కట్టనుంది. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఇలియానా కి చాలా అభిమానులున్నారు. ఇక్కడ మంచి సినిమాలతో జోరందుకున్న తరుణం లోనే బాలీవుడ్ కి షిఫ్ట్ అవడం తో, ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అక్కడ కూడా పెద్ద గా సక్సెస్ కాకపోవడం తో, ఇలియానా మళ్ళీ తెలుగు బాట పట్టింది. కాగా, ఇక్కడ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా కూడా డిసాస్టర్ గా నిలిచింది. హిందీ లో చేసిన 'పాగల్ పంతి' కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతం ‘ది బిగ్ బుల్ ’ పై నే ఆమె ఆశలు పెట్టుకుంది.

    ఇలాంటి టైమ్ లో ఆమెకు పవన్ కళ్యాణ్ పక్కన జోడి కట్టే ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా తమిళంలో ‘నేర్కొండపార్వై’గా విడుదల ఐంది. కాగా, ఈ సినిమా లో అజిత్ కి జోడీగా విద్యాబాలన్ నటించారు. పవన్ కళ్యాణ్ పక్కన తొలుత శృతి హాసన్ ను అనుకున్నారు. మరి డేట్ అడ్జస్ట్ అవలేని కారణము గా ఈ ఆఫర్ ఇలియానా ని వరించినట్లు తెలుస్తోంది. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21 నుంచి ఫైనల్ షెడ్యూల్  జరగనుంది. హీరోయిన్ ఎవరో తేలితే తప్ప ఈ ఫైనల్ షెడ్యూల్ పూర్తవదు. అన్ని అనుకున్నట్లే జరిగితే, పవన్ కళ్యాణ్ ఇలియానా ల జంట మరోసారి మనముందు కి రానుంది.