వరల్డ్ కప్ ఫైనల్ లో 'పక్కా లోకల్' సాంగ్..!

post

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రం లో పక్కా లోకల్ సాంగ్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. సాంగ్ బీట్ కి, ఎన్టీఆర్, కాజల్ ల స్టెప్పులకి అభిమానులు ఉర్రుతలూగిపోయారు. ఈ పాట సినిమా విడుదల సమయం లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. . ఈ సాంగ్‌ని ఇప్ప‌టికీ ప్రైవేట్ ఫంక్ష‌న్స్‌లోను లేదంటే పెద్ద పెద్ద వేడుక‌ల‌లోను ప్లే చేస్తుంటారు.

  అయితే, మార్చి ఎనిమిది న మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్య ఫైనల్స్ జరిగాయి. ఇందుకోసం దాదాపు 82000 మంది హాజరయ్యారు. వచ్చిన వారిలో ఎక్కువగా భారతీయులే ఉండడం తో 'పక్కా లోకల్' సాంగ్ ని ప్లే చేసారు. మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఈ సాంగ్ ప్లే కావడం తో అభిమానులు స్టెప్పులేశారు. మరికొంతమంది 'జై బాలయ్య' 'జై బాలయ్య' అంటూ అరుస్తున్నారు. కొందరు ఈ వీడియో ను చిత్రీకరించి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తో ఈ వీడియో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుష్ లో ఉన్నారు.