ఉగాది కి రానున్న ప్రభాస్ కొత్త లుక్..!

post

బాహుబలి సినిమా తో ఇంటర్నేషనల్ గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ప్రభాస్ కు చాలా మందే అభిమానులున్నారు. ప్రభాస్ చాల సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ఆలస్యం గా వచ్చినా చాల లేటెస్ట్ లుక్ తో ప్రభాస్ అదరగొట్టేస్తాడు. బాహుబలి కోసం ఐదు సంవత్సరాలు కెరీర్ ను త్యాగం చేసాడంటే వృత్తి పట్ల అతని కమిట్మెంట్ ను అర్ధం చేసుకోవచ్చు. అందుకే అభిమానులు అతని అప్డేట్స్ కోసం అంతలా ఎదురుచూస్తారు. బాహుబలి తరువాత ఏడాది గ్యాప్ తో వచ్చినా 'సాహో' లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమా హిందీ ప్రేక్షకాకులను బాగానే ఆకట్టుకున్న, టాలీవుడ్ లో అంత నచ్చలేదు. ఇక ప్రభాస్ నెక్స్ట్ స్టెప్ ఏంటా అని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.

         ప్రభాస్ 20 వ మూవీ సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులే ఐంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజా గా, ప్రభాస్ జార్జియా కి వెళ్లేముందు చిత్ర బృందం యూర‌ప్ వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా ప్ర‌త్యేక‌మైన ఇల్లు, ట్రైన్ సెట్ వేసి  ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలపై నాలుగు వేర్వేరు దుస్తుల‌లో ఫోటో షూట్ చేశార‌ట‌. ఈ నాలుగు స్టిల్స్ నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ కోసం రెండు పోస్టర్లను ఖరారు చేశారట. ఒక పోస్టర్లో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే రైలు కంపార్ట్మెంట్లో కూర్చుని కనిపిస్తారు. రెండవ పోస్ట‌ర్‌లో ఇద్ద‌రు క‌లిసి పియానోను ప్లే చేస్తూ  ఉల్లాసమైన మూడ్‌లో ఉన్న‌ట్టుగా కనిపిస్తారు.

           రాబోయే తెలుగువారి పండగ ఉగాది సందర్భం గా ఈ రెండు పోస్టర్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరి లో ఈ చిత్రం విడుదల కావచ్చని అంచనా.