రాఘవ తమ్ముడు వేధిస్తున్నాడు..:దివ్య

post

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ మనందరికీ సుపరిచితమే. కాగా, ఆయన తమ్ముడు వినోద్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సినీనటి దివ్య మీడియా ముందుకు వచ్చారు. 2015 లో వినోద్ తనను వేధింపులకు గురిచేయడం ప్రారంభించారని, అప్పటి వెస్ట్ మారేడుమిల్లి సిఐ రవీందర్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తే, తనపై బ్రోతల్ కేసు పెట్టారని  ఆ యువతి ఆరోపిస్తోంది. ఇంకా, అతను సిఐ నుంచి ఏసీపీ గా ప్రమోషన్ ను పొందినట్లు కూడా తెలిపింది.

       మంగళవారం ఆమె  ఎస్సి , ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఈ విషయమై ఫిర్యాదు చేసారు. 2015 నుంచి తనను లైంగికం గా లారెన్స్ తమ్ముడు వినోద్ వేధిస్తున్నారని, న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళితే, అప్పటి సీఐ బ్రోతల్ కేసు పెట్టి వేధించారని కమిషన్ చైర్మన్ కు దివ్య వివరించారు.

అక్రమ రవాణాకు పాల్పడ్డారు..!

తననే కాదని, తనలాగా అనేకమంది అమ్మాయిలను ప్రేమ పేరుతొ చేరి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. అంతే కాకుండా, లారెన్స్ మరియు అతని తమ్ముడు అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, ఆ వివరాలు తనకు తెలియడం తోనే, తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంకా, తనను చంపాలని ప్రయత్నిస్తారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది.