మెగా ఫోన్ పట్టిన హీరోయిన్..!

post

టాలీవుడ్ లో  దర్శకురాళ్ల సంఖ్య  తక్కువే. సావిత్రి, విజయనిర్మల, జీవిత, నందినిరెడ్డి, సుధ కొంగర.. ఇలా కొంత మందే మెగా ఫోన్ పట్టారు. ఇపుడు ఈ జాబితాలో  ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి చేరారు. చేతన్ హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం చేస్తున్న కళ్యాణి ఈ సినిమాకు నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్నారు.  సినిమా ప్రీలుక్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విడుదల చేశారు. కల్యాణికి శుభాకాంక్షలు చెప్పి, మద్దతు తెలిపారు.

రాజ‌శేఖ‌ర్ హీరోగా చేసిన ‘శేషు’ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన క‌ల్యాణి ప‌లు చిత్రాల్లో న‌టించి  డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్‌ను వివాహం చేసుకున్నారు. త‌ర్వాత కొన్నిరోజుల పాటు ఈమె సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అయితే భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న క‌ల్యాణి..ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తున్నారు. లెజెండ్‌, టాక్సీవాలా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన క‌ల్యాణి . ఇపుడు ద‌ర్శ‌కురాలిగా అవతారమెత్తారు.  ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషించబోతున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ఆరంభం కాబోతోంది. చేతన్‌ ‘రాజు గారి గది’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి సినిమాల్లో నటించారు. కల్యాణి ‘యాత్ర’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు.