శ్రీవారి ఆర్జిత సేవలకు జూన్ కోటా టిక్కెట్లు విడుదల..!

post

భక్తుల కోర్కెలు తీర్చేవాడు, ఆపదమొక్కుల వాడు, భక్త సులభుడు అయిన కోనేటి రాయుడి దర్శనం ఇపుడు అంత సులభమేమి కాదు. దర్శనం మొదలుకొని, అర్చన, పాదసేవ, వంటి అన్ని ఆర్జిత సేవలకు ముందస్తు గా టిక్కెట్లు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు, జూన్ నెలకు గాను టిక్కెట్లను విడుదల చేసారు. మొత్తం 60,666 టికెట్లు విడుదల చేసారు. కాగా, ఇందులో 50,700 టికెట్లు ఆన్ లైన్ జనరల్ కోటా లో అందుబాటులో ఉన్నాయి.

    ఈ టిక్కెట్లలో, అష్టదళ పద్మారాధన 300, తోమాల 130, అర్చన 130 నిజపాదదర్శనం 1725, సుప్రభాతం 7,681 ఉన్నాయి.  ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, ఊంజల్ సేవ 4,200,  కల్యాణం 13,300, సహస్ర దీపాలంకార సేవ 17,400, విశేష పూజలవి 1500  టిక్కెట్లు ఆన్లైన్ కోటా లో అందుబాటులో ఉన్నాయి.