చైనా స్మార్ట్ హెల్మెట్..దూరం నుంచే టెంపరేచర్ చెప్తుంది..!

post

కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలను అమలు చేస్తోంది. కరోనా ఉందన్న అనుమానం ఉంటె, వారిని ఐసోలేషన్ లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకేరోజు, వందల్లో కరోనా అనుమానితులు వచ్చి పడుతుండడం తో చైనాకు దిక్కు తోచడం లేదు. మరోవైపు, జనాభా లో ఎవరికీ కరోనా ఉందొ గుర్తించడం కూడా కష్టతరం గా ఉంది. లక్షణాలు బయట పడ్డాక గుర్తించేలోపు, మరికొందరికి ఆ వ్యాధి సోకుతూ ఉంది. ఈ కష్టం నుంచి బయటపడడానికి చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. 

       ఈ నేపధ్యం లో, తాజాగా చైనా నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు ఆఫీసర్ తలకు ఓ హెల్మెట్ లాంటి దానిని పెట్టుకుని వీధిలో వెళ్తున్న అందరి బాడీ టెంపరచర్లను గమనిస్తున్నాడు. ఈ డివైస్ ఒక స్మార్ట్ హెల్మెట్ లాంటిది. ఇది ఐదు మీటర్ల దూరం లో ఉన్న మనుషుల టెంపరచర్లను దాని స్క్రీన్ మీద చూపించగలదు. శక్తిమంతమైన ఇన్ ఫ్రారెడ్  సెన్సర్లు, కెమెరా తో అమర్చబడిన ఈ హెల్మెట్ స్క్రీన్ పై మనుషుల శరీర ఉష్ణోగ్రతలు ఆటోమేటిగ్గా చూపిస్తాయి. ఈ విషయాన్నీ  చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తెలిపింది. నిర్ణిత టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటె, ఈ డివైస్ అలారమ్ ను మోగిస్తుంది. అపుడు ఆ వ్యక్తి కి పరీక్షలు చేసి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

మనము ఇవే వాడతాం..!

      చైనా లోనే కాదు, ఇండియా తో సహా ఇతర దేశాలు కూడా ఇలాంటి ఇన్ఫ్రా రెడ్ సెన్సార్లు ఉన్న డివైస్ లనే వాడుతున్నాయి. స్క్రీనింగ్ సమయం లో ఈ డివైస్ ను నుదుటి వద్ద ఉంచి టెంపరేచర్ ను కొలుస్తారు. కాకపోతే, చైనా వద్ద ఉన్న ఈ స్మార్ట్ హెల్మెట్ ఐదు మీటర్ల దూరం లో ఉన్న మనిషి టెంపరేచర్ ను కూడా గుర్తించగలదు. ఆర్మీ లో ఎక్కువగా ఇలాంటి సెన్సర్లను వాడతారు. దూర ప్రాంతం లో ఉన్న వేడి వస్తువులను గుర్తించడానికి ఇవి సహాయపడతాయి.