అప్పుడే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నా..!

post

Mahesh Babu: హీరో అవ్వాలని తనలో ఎప్పుడు బీజం పడిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు తాను కూడా హీరో అవ్వాలని భావించానని అన్నారు. హీరోగా తనను ఇన్‌స్పైర్ చేసింది కూడా తన తండ్రి అని మహేష్ తెలిపారు. తాను సంతోషంగా ఉండేందుకు తన కుటుంబమే కారణమని మహేష్ పేర్కొన్నారు. ఇక తనకు సిగ్గు ఎక్కువని.. సెన్సిటివ్ పర్సన్‌ను అంటూ మహేష్ తన గురించి వెల్లడించారు. సోషల్ మీడియాలో తనను ప్రస్తావిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ఇక క్యాజువల్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని మహేష్ అన్నారు.