కరోనాపై ముందే హెచ్చరించిన డాక్టర్‌ మృతి

post

కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని ముందే హెచ్చరించిన వుహాన్‌ డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ (34) అదే వైరస్‌ బారిన పడి మృతి చెందారు. సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తన ఆస్పత్రిలో చేరారని, వారిని పరీక్షించగా సార్స్‌ బారిన పడ్డారని తేలిందని, దేశంలో ఈ వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉందంటూ లీ.. నిరుడు డిసెంబరు 30న తన వీ చాట్‌ గ్రూప్‌లో హెచ్చరించారు. ఈ పోస్టు చేసినందుకు పోలీసులు ఆయనను ఇబ్బంది పెట్టారు. కరోనా బారిన పడి జనవరి 12 నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. చివరకు మృతి చెందారు.