సజ్జలతో మంచూరియా

post

కావలసిన పదార్థాలు: సజ్జ పిండి - 150 గ్రా., మిర్చి - 10 గ్రా., కొత్తిమీర - 5 గ్రా., పుదీన - 5 గ్రా., కార్న్‌ఫ్లోర్‌ - 15 గ్రా., బంగాళదుంప - 20 గ్రా., క్యారెట్‌ - 15 గ్రా., ఉల్లిపాయలు - 15 గ్రా., చిల్లి సాస్‌ - 25 మి.లీ., సోయా సాస్‌ - 25 మి.లీ., ఉప్పు - రుచికి తగినంత, నీళ్ళు - 60 మి.లీ.

 

తయారీ విధానం: ముందుగా కూరగాయలను ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి. వీటిని పిండిలో కలిపి తగినంత ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకుని కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి. మరొక కడాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిల్లీసాస్‌, సోయాసాస్‌ వేసి కొంచెం నీళ్ళు పోసి ముందుగా తయారు చేసుకున్న మంచూరియా వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. వీటిని వేడిగా తింటే బాగుంటాయి.

 

పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 355 కి.కెలోరీలు, ప్రొటీన్లు 11.7 గ్రా.