ఊదల అన్నం

post

కావలసిన పదార్థాలు : ఊదలు - 100 గ్రాములు/ 1 కప్పు - నీరు - 2 కప్పులు, ఉప్పు - తగినంత.

 

తయారీ విధానం : ఊదల్ని ముందుగా శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్‌లో ఊదలతో పాటు 2 కప్పుల నీరు పోసి కొద్దిగా ఉప్పు వేసి 3 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. వేడివేడి ఊదల అన్నంలో కమ్మని పులుసు కూర వేసుకుని తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే.

 

పోషక విలువలు: 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 300 కి.కెలోరీలు, ప్రొటీన్లు 6.2 గ్రా., కొవ్వు 4.8 గ్రా., కాల్షియం 22 మి.గ్రా., భాస్వరం 280 మి.గ్రా., ఇనుము 18.6 మి.గ్రా.