డిజిటల్ లిటరసీ దిశగా కేరళ..!

post

డిజిటల్ లిటరసీ లో భాగంగా దేశంలోనే ఆధర్శవంతమైన ప్రాజెక్టు అమలు చేయాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. కేరళ లోని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్పర్మేషన్ అండ్ టెక్నాలజీ అధ్వర్యంలో ఐటీ మిషన్ అయామ్ ఆల్సో డిజిటల్  పేరిట దీన్ని ముందుకు తీసుకువెళ్లటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వార్డు స్దాయి లో   రీసోర్స్ పర్సన్స్, ఇనస్ట్రక్టర్ష్ ద్వారా  ప్రజల్లో ఆన్ లైన్ సర్వీసులు, సైబర్ సెక్యూరిటీ త. ఈ -గవర్నెన్స్,వివిధ డిజిటల్ ప్లాట్ ఫారంలు, సర్వీసులకు సంబందించి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. సోషల్ మీడియా ప్రాముఖ్యత, దాని అవసరం, దాన్ని తప్పుగా ఉపయోగిస్తే కలిగే ఇబ్బందులు కూడ వివరించడం జరుగుతుంది.
 
 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ ప్రాజెక్టు ను రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో పైలట్ ప్రాజెక్టుగా ముందు అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివేండ్రంలోని 100 వార్డుల్లో ప్రతీ వార్డు నుంచి ఐదుగరు ఇన్ స్టక్టర్లు చొప్పున ఎంపిక చేస్తారు. 50 మంది మాస్టర్ ట్రయినీలకుఐటీ టూల్ష్ పై శిక్షణ ఇచ్చిన తరువాత వారు వార్డు  ఇన్ స్టక్టర్లతో కలిసి పనిచేస్తారు. వీరే కాకుండా కాలేజీ విద్యార్దులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్టు ఉద్యోగులు, సంస్దలకు చెందిన వారు ఎవరయినా వీరితో కలసి పనిచేయడానికి ముందుకు వస్తే వారికి కూడ అవకాశం ఇస్తారు. త్రివేండ్రంలో ఇది పూర్తయిన తరువాత దీని ఫలితాలను బట్టి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు.