విద్యా వ్యాపారంలో మంత్రులకు వాటా: కోదండ

post

రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కార్పొరేట్‌ విద్యా వ్యాపారంలో రాష్ట్ర మంత్రులకు వాటాలున్నాయని ఆరోపించారు. రకరకాల బ్యాచ్‌ల పేరుతో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఒకటే బ్రాంచ్‌ పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో కాలేజీల ను నడిపిస్తున్నారన్నారు. ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చే వరకూ పోరాడుతామని చెప్పారు. విద్యార్థి జన సమితి రూపొందించిన పోస్టర్‌ను కోదండరాం గురువారం విడుదల చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజున తమ పార్టీ కార్యాయలంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఫేర్‌ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా మెట్రో రైలు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ వీసీలను నియమించలేని అసమర్థ ప్రభుత్వ పాలనలో ఉన్నామన్నారు. కొట్లాడి తెచ్చుకు న్న తెలంగాణలో పోరాటాలను అణిచివేసే కుట్ర జరుగుతున్నదని తెలంగా ణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టాలన్నారు.