రాములోరి కల్యాణానికి హెలికాఫ్టర్లు..!

post

ఉగాది వెళ్ళగానే, తెలుగింట రాములోరి కల్యాణ హడావిడి మొదలవుతుంది. అందులోను భద్రాద్రి అంటే, అక్కడి ఉత్సవ హడావిడే వేరు. దక్షిణ అయోధ్య గా పిలుచుకునే భద్రాద్రి రాములోరికి తెలుగు రాష్ట్రాల్లో బోలెడు భక్తులున్నారు. అలాంటి అందరి బంధువు రామయ్య కి కల్యాణ వేడుక అంగరంగవైభవం గా జరగాల్సిందే.

      ఈ వేడుకలకు హెలికాప్టర్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ విషయమై తాము సీఎం కెసిఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గురువారం జరిగిన శాసన మండలి సమావేశాల్లో ఆయన ఈ విషయం గురించి చెప్పారు. ఈ సమావేశం లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వరంగల్ ను టూరిజం స్పాట్ గా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

రామప్ప దేవాలయం కూడా..!

ప్రఖ్యాతి కలిగిన రామప్ప దేవాలయాన్ని కూడా అంతర్జాతీయ పురాతన వారసత్వం గా గుర్తించేందుకు ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సింది గా కోరామని ఆయన ఈ సమావేశం లో చెప్పారు. ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు శాఖ పరిధిలో  ఉందని, ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి టూరిజం ను పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. రామప్ప లో ఉన్నా ఐలాండ్ ను కూడా టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తామని ఆయన అన్నారు. పర్యాటక రంగం మీద నిర్లక్ష్యమే లేదని, రాష్ట్రము లో అనేక ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.