అయోధ్య రామాలయానికి రూ.కోటి విరాళం..!

post

శివసేశివసేన సుప్రీం ఉద్ధవ్ థాకరే..అయోధ్యలో . రామాలయ నిర్మాణానికి మహారాష్ట్ర తరఫున కోటి రూపాయలు ప్రకటించారు.న సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వం 100 రోజుల పాలన ముగించుకున్న సందర్భంగా శనివారంనాడు అయోధ్యకు వచ్చిన . ఉద్ధవ్ తన భార్య రష్మి థాకరే, కుమారుడు ఆదిత్య థాకరే తదితరులతో కలిసి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అయోధ్య రామాలయంలో ప్రార్థనలు చేయడం తన అదృష్టమని, త్వరలోనే మళ్లీ అయోధ్యకు వచ్చి సరయూ నదికి జరిపే హారతిలో పాల్గొంటానని చెప్పారు.
 కరోనా వైరస్ నేపథ్యంలో జనసమూహాలకు దూరంగా ఉండాలని  ఆయన సరయూ నది హారతిలో పాల్గొనలేదు. అయోధ్య పర్యటనకు వచ్చిన థాకరేకు పార్టీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. ఉద్ధవ్ ఆలయ పర్యటనకు ముందు పలువురు మహా వికాస్ అఘాడి మంత్రులు, నేతలు సైతం అయోధ్యకు వచ్చారు. ఆయనతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.