నరసింహ స్వామి విగ్రహంపై సూర్య కిరణాలు..!

post

అనంతపురం జిల్లా గుత్తి కోట లోని కొండపై వెలిసిన చారిత్రాత్మక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో  శుక్రవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కరించింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ గర్భగుడిలోని నరసింహ స్వామి విగ్రహంపై  సూర్య కిరణాలు తాకిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది సూర్యుడు లేలేత కిరణాలు స్వామి వారి  మూలవిరాట్ పై నేరుగా తాకాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఏడాదంతా  మంచి జరుగుతుందని  భక్తుల నమ్మకం.  . ఈ సూర్య కిరణాలు ప్రతి ఏడాది పాల్గుణ మాసం ఉత్తరాయణం, దక్షిణాయణం ,లో రెండు విడతలుగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.ఈ సూర్య కిరణాలు మెుదటి మూడు రోజులపాటు  స్వామి వారి మూల విరాట్టు పై పడతాయి.ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు వేకువజామున నుండి ఆలయం వద్దకు అధిక సంఖ్యలో చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు.