తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల..!

post

తెలంగాణ ఐసెట్ 2020 కు షెడ్యూల్ విడుదల ఐంది. ఈ షెడ్యూల్ ను ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం నేడు విడుదల చేసారు. కాగా, మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని చెప్పారు. అయితే, ముప్పై వ తేదీతో గడువు ముగియనుంది. ఆ తరువాత మే పదునాలుగవ తేదీ వరకు ఫైన్ తో (500 ) దరఖాస్తు చేసుకోవచ్చు. మే పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవద్దని ఐదువేల రూపాయల ఫైన్ విధించారు. మే 14 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 27 వ తేదీన ప్రాధమిక కీ విడుదల చేయనున్నారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!

ఈ సారి తెలంగాణ ఐసెట్ పరీక్షకు ఒక నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. అనగా, ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా గది లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసారు. పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు విధిగా ఇచ్చిన గడువు లోపల హాజరు కావాల్సింది గా సూచించారు.