డబ్బులు డోర్ డెలివరీ..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణం లో బయటకు రావాలంటే జంకే పరిస్థితి ఉంది.  ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు తీసుకోవాలంటే గగనతరమే అది ఇక. పైగా వృద్దులకు, దివ్యంగులకు ఇది మరింత కష్టతరం గా ఉంది. వీరికోసం బ్యాంకులు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. కరోనా వైరస్ మూలం  గా బ్యాంకులు కొన్ని ప్రత్యేకమైన సేవలను ఇంటి వద్దకే అందిస్తున్నాయి. పలు బ్యాంకులు కస్టమర్స్ కు డోర్ స్టెప్ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సేవల్లోనే, ఏటీఎం నుంచి డబ్బులు తెచ్చుకునే పని లేకుండా ఇంటివద్దకు వచ్చి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ బి ఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. వృద్దులు, దివ్యంగులకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఈ సర్వీసుకు రూ.100 చార్జ్ వేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.5,000 నుంచి రూ.25,000 వరకు డబ్బులు ఇంటికి తెచ్చుకోవచ్చు. అందుకు గాను వంద నుంచి రెండు వందల వరకు ఛార్జ్ చేస్తోంది. ఐతే, ఈ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు యాభై రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది.