లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు...!

post

కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న తరుణం లో ఇప్పటికే రెండు సార్లు ట్రేండింగ్ ను నిలిపివేయవలసి వచ్చింది. తాజాగా, ఈరోజు ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్లు తొలుత నష్టాల్లోనే మొదలైనప్పటికీ, తరువాత వేగం పుంజుకున్నాయి. దానితో లాభాల బాట పట్టాయి. ఈ నేపధ్యం లో ఇన్ఫోసిస్ కు పన్నెండు శాతానికి పైగా లాభం వచ్చింది. నిఫ్టీ 191 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 693 పాయింట్లు లాభపడింది. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను ప్రకటించే అవకాశం ఉండడం తో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనితో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పడ్డాయి.
    ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 693 పాయింట్లు పెరిగి  26,674కి చేరింది. నిఫ్టీ 7,801కి చేరింది. దీనితో  191 పాయింట్లు లాభానికి చేరుకుంది. ఐటీ, టెక్, ఎనర్జీ సూచీలు భారీగా లాభాలు పొందాయి. ఇన్ఫోసిస్ (12.69%),హెచ్సీఎల్ టెక్నాలజీస్ (6.86%) హిందుస్థాన్ యూనిలీవర్ (8.34%), బజాజ్ ఫైనాన్స్ (9.78%), మారుతి సుజుకి (7.48%) గా ఉంది. కాగా, మహీంద్రా అండ్ మహీంద్రా,  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ నష్టాలను చవి చూశాయి.