సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయం..! ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపాలన్న ఉత్తమ్..!!

post

న్యూఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణా రైతాంగ సమస్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే గులాబీ పార్టీ రైతు సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఆరోపించారు. తెలంగాణలో వర్షాలు లేక వ్యవసాయం ఇంకా మొదలు కాలేదని, ప్రభుత్వ సాయం కూడా పెద్దగా లేదని ఆయన వివరించారు. రైతు రుణ మాఫీ అని చెప్పిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అనేక సమస్యల్లో చిక్కుకున్నారని తెలిపారు. చాలమంది రైతులకు అప్పులు పెనుభారంగా పరిణమించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించండం దారుణమని ఆయన అభివర్ణించారు.