లక్షా 65 వేల కోట్ల అంచనాలతో: సంక్షేమం..సాగుకు ప్రాధాన్యత: వెంటాడుతున్న బకాయిలు..!!

post

2019-20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టనుంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ దాదాపుగా రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019-20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను మరి కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించనుంది.