ఐపీఎల్ మాకొద్దు..ఢిల్లీ ప్రభుత్వం...!

post

వుహాన్ కరోనా వైరస్ భారత్ లోను విస్తరిస్తోంది. 76 కేసులతో పాటు తొలి కరోనా మరణం కూడా నమోదైంది. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు (76 ) కరోనా వైరస్ సోకడం తో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో, అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఐపీఎల్ పై పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యం లో రాష్ట్రాలు ఐపీఎల్ ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నాయి.

       మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐపీఎల్ ను రద్దు చేసి, టిక్కెట్ల అమ్మకాన్ని కూడా నిషేధించింది. ఎక్కువ మంది ఓ చోట చేరడం తో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఐపిఎల్ ను రద్దు చేయడానికి సంకల్పిస్తున్నారు. తాజాగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఐపిఎల్ ను రద్దు చేసింది. ముందు జాగ్రత్త కోసం ఐపీఎల్ తో సహా అన్ని ఇతర ఆటలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసారు. కరోనా వైరస్ ను విస్తరించకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మార్చ్ 31 వరకు విద్యాలయాలు, సినిమా థియేటర్లను మూసివేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ లో తాజాగా మరోకేసు నమోదు కావడం తో  భార‌త్‌లో 76 కేసులు న‌మోదైన‌ట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి ని నివారించడానికి ఎవరు గుంపులు గుంపులు గా ఒక చోట చేరకూడదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.