కరోనా నిరోధానికి రైల్వే చర్యలు..!

post

దేశంలో కరోనా వైరస్ బాధితులు 70 మందికి పైగా చేరడంతో అన్ని ప్రభుత్వ శాఖలు దీనిపై అప్రమత్తాయి. దీనిపై ప్రజలను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాయి. ప్రపంచలోనే రెండవ అతిపెద్ద వ్యవస్ద , రోజులకు రెండు కోట్లకు పైగా ప్రయాణీకులు పర్యటించేఇండియన్ రైల్వేకరోనా వైరస్ పై తమ శాఖ తరపున పలు చర్యలకు శ్రీకారం చుట్టింది.  దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోను పోస్టర్లు, పాంప్లెట్లు  పంపిణీ చేయడం ద్వారా కరోనా పై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.. రైల్వే కాలనీల్లో కరోనా అనుమానితులు వుంటే వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో టెలి ఫోన్ హెల్ప్ లైన్స్, కంట్రోల్ రూమ్స్ ఏర్ఫాటు చేసారు.  రైల్వే ఆసుపత్రుల్లో 1,000 ఐసోలేషన్ బెడ్స్, 12,000 క్వారంటైన్ బెడ్స్  సిద్దం చేసారు.  రైల్వే ఆసుపత్రుల్లో జ్వరంతో వున్న రోగులను ప్రత్యేకంగా వుంచి వారిపై ప్రత్చేక శ్రధ్ద చూపుతున్నారు. రైల్వే ఆసుపత్రులు, హెల్త్ యూనిట్లలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఎవరైనా వుంటే వెంటనే వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు, రైల్వే బోర్డ్ చైర్మన్ కు తెలపాలని ఆదేశాలు జారీ చేసారు.  రైల్వే కు సంబంధించిన హెల్త్  సిబ్బంది, అధికారులు  ఆయా రాష్టాలకు చెందిన ఆరోగ్య శాఖతో నిరంతరం టచ్ లో వుండి కరోనా కు సంబందించి అప్ డేట్ అవ్వాలని , రైల్వేలో బయోమెట్రిక్ ను నిలిపివేయాలని కూడ నిర్ణయం తీసుకున్నారు.