వేలిముద్రల వెసులుబాటుతో పెన్షన్ నొక్కేస్తున్న కార్యదర్శులు..!

post

వృధ్యాప్యం లో సాయమందించడం కోసం, తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' పింఛన్ల పంపిణి పధకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, లబ్ధిదారుల వేలిముద్రలు కొన్ని సార్లు పడకపోవడం తో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనితో, అన్ని ఆధారాలు సరిగా ఉంటె, కార్యదర్శుల వేలిముద్రలతో పింఛన్లను తీసుకునే వెసులుబాటు ను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కాగా, దీనిని అదను గా తీసుకుని కొంతమంది పంచాయితీ కార్యదర్శులు దాదాపు కోటి రూపాయలవరకు నొక్కేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది, లబ్ధిదారులు చనిపోయినా కూడా, వారి పేర్లతో పెన్షన్లను తీసుకున్నారు. ఈ విషయాలని గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో బయటపడ్డాయి. ఈ అంశం పై, తెలంగాణ ప్రభుత్వం మరింత లోతుగా విచారణ ప్రారంభించింది. అయితే, కార్యదర్శులు నెలల తరబడి చనిపోయిన వారి పెన్షన్లను సొంత వేలిముద్రల ద్వారా తీసుకున్నట్లు వెల్లడైంది.

     ఇలా దొంగతనం గా తీసుకున్న సొమ్మంతా దాదాపు కోటి రూపాయల వరకు ఉండొచ్చని ఓ అంచనా. కాగా, ఈ డబ్బును రికవరీ చేయాలని కలెక్టరు కార్యదర్శులకు ఆదేశించారు. అంతేకాకుండా, వారిపై శాఖాపరమైన చర్యలను కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఆధార్ ఒకరిది..సొమ్ము మరొకరిది..!

అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఓ ముసలవ్వ కు రెండేళ్ల నుంచి పెన్షన్ రావడం లేదు. ఆమె ఆధార్ నెంబర్ నుంచి వస్తున్న డబ్బు మరొకరికి చేరుతోంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం రేగట్టకు చెందిన గంజి మల్లమ్మకు 2015 మార్చి నుంచి ఆసరా పధకం ద్వారా పెన్షన్ లభిస్తుంది. 2018 నుంచి ఆమెకు పెన్షన్ రావడం ఆగిపోయింది. కారణమేమిటో తెలియక ఆమె రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతోంది. విచారణ లో మల్లమ్మ ఆధార్ కు బుర్కల మారెమ్మ పెన్షన్ ఐడీతో సీడింగ్ జరిగినట్లు తెలిసింది. పెన్షన్ స్టేటస్‌‌‌‌ రిపోర్టులో ఫొటో, ఆధార్ నంబర్ మల్లమ్మది కనిపిస్తుండగా పెన్షనర్ నంబర్ మారెమ్మది కనిపిస్తోంది. దీనితో రెండేళ్ల నుంచి పెన్షన్ డబ్బులు మారెమ్మ పెన్షన్ నెంబర్ కు వస్తున్నాయి. కార్యదర్శి మాత్రం, రెండేళ్ల నుంచి మల్లమ్మ పేరుతొ పెన్షన్ రావడం లేదు అని చెప్పి, అతని వేలిముద్రతోనే డబ్బులు తీసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆ సొమ్మును కార్యదర్శి తీసుకుంటున్నారో లేక మరియమ్మ కు ఇస్తున్నారో తెలియాల్సి ఉంది.