కెనడా ప్రధాని భార్యకు కరోనా..!

post

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో మొదలై ఇప్పటికి దాదాపు నూట పదమూడు దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. ఈ మహమ్మారిని కట్టడి చేయడం అగ్ర రాజ్యమైన అమెరికా, అధిక జనాభా ఉండి, నియంత దేశం గా పేరుగాంచిన చైనా వల్ల కూడా కావడం లేదు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా దాదాపు అందరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కెనడా ప్రధాని భార్య కు కూడా ఈ వైరస్ బాధ తప్పలేదు. 
     కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కూడా ఈ వైరస్ కు గురయ్యారు.  జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పారు. కాగా, డాక్టర్ల సూచనా మేరకు ఆమెను ఐసోలేషన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. తానుకూడా పరీక్షలు చేయించుకున్నట్లు, కానీ తనలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఆయన తెలిపారు. అయినా, పదునాలుగు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండి తన విధులను ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు.