ఐఆర్‌సీటీసీ కి కరోనా షాక్..!

post

కరోనా వైరస్ కారణంగా రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)   అయిదు రోజుల శ్రీలంక యాత్రను రద్దు చేయాలని  నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి  హైదరాబాద్‌ నుంచి శ్రీలంకకు ‌,ప్రారంభం కావాల్సిన రామాయణ యాత్ర ను కూడ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు భారత్‌ దర్శన్‌’ కింద తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ కశ్మీర్‌, ఉత్తరభారత  యాత్రలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలో  10 నుంచి 15 శాతం వరకూ టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు మే, జూన్‌ నెలల్లో  వుండే  సింగపూర్‌, మారిషస్‌, బాలి, మలేసియా, యూరప్‌ ఖండంలోని వివిధ దేశాల యాత్రలను కూడా ఉపసంహరించే ఆలోచనలో ఐఆర్‌సీటీసీ వుంది.