బ్లడ్‌ సెంటర్స్‌ గా బ్డడ్ బ్యాంకులు..!

post

ఇకపై  ఎవరికి వారు ఇష్టానుసారంగా రక్తదానాలు చేయడానికి వీలుండదు. రక్తదానం విషయంలో అవసరానికన్నా ఇతర విషయాలే కీలకంగా వుంటున్నందున వీటికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది.ఇక మీదట బ్లడ్‌ బ్యాంకులను బ్లడ్‌ సెంటర్స్‌గా పిలవాలని పేర్కొంటూ డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ నిబంధనలను సవరిస్తూ  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకులను బ్లడ్‌ సెంటర్స్‌గా పిలుస్తున్నందున దేశంలోనూ ఆమేరకు సవరణ చేశారు. రక్తదాతలకు కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 65 ఏళ్లు ఉండాలన్న నిబంధనలు విధించారు.తొలిసారి రక్తదానం చేసే వ్యక్తి వయస్సు అయితే 60 ఏళ్లకు మించకూడదని, తరచుగా  చేసేవారికి అయితే 65 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు. రక్తదానానికి 104 మార్గదర్శకాలు విధించారు.. విదేశీయులు వరుసగా మూడేళ్లు భారత్‌లో ఉంటేనే వారి నుంచి రక్తం దానంగా స్వీకరించాలన్న నిబంధన పెట్టారు. పళ్లు పీకించుకున్నవారు కూడా 6 నెలల తర్వాతే రక్తదానం చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మహిళలు కాన్పు తర్వాత 12 నెలలపాటు, అబార్షన్‌ తర్వాత 6 నెలలపాటు రక్తదానం చేయకూడదని నిర్దేశించింది.