పెద్దల సభకు టీఆర్ఎస్ అభ్యర్దులు..!

post

టీఆర్‌ఎస్ అధిష్ఠానం తన రాజ్యసభ అభ్యర్థులను గురువారం ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే రాజ్యసభ సభ్యుడు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే. కేశవరావుకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా  సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. రెండవ అభ్యర్ది మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఎంపిక కావడం విశేషం. నిజామాబాద్  జిల్లాకు చెందిన  మాజీ స్పీకర్, సీనియర్ నేత కే.ఆర్. సురేశ్ రెడ్డి  టీఆర్ ఎస్ తరపున రాజ్యసభ అబ్యిర్దిగా ఎంపికయ్యారు. శుక్రవారం వీరిద్దరూ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.. గురువారం సీఎం కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో నిజామాబాద్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే  సురేశ్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించినట్లు సమాచారం.