పదిలక్షల కార్లతో టెస్లా రికార్డు..!

post

పదిలక్షల కార్లను ఉత్పత్తి చేయటం ద్వారా ఆటోమొబైల్‌ దిగ్గజం టెస్లా‘ఎలక్ట్రిక్‌ పాసింజర్‌ కార్ల’ రంగంలో తిరుగులేని ఘనతను సొంతం చేసుకుంది...ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయమై సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన సిబ్బందికి ట్విటర్‌ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. తమ తాజా ఉత్పత్తి అయిన ‘మోడల్‌ వై’ కారు చిత్రాన్ని కూడా షేర్‌ చేశారు. 2003లో ఉత్పత్తిని ప్రారంభించిన ఈ అమెరికన్‌ వాహన తయారీ సంస్థ,  తన లేటెస్ట్‌ మోడల్‌ కారు ‘మోడల్‌ వై’ని ఈ వాహన తయారీ దిగ్గజం అంచనాల కంటే ముందుగానే మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది మరో ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రిక్‌ వాహనం ‘సైబర్‌ ట్రక్’ తయారీని టెస్లా 2021 సంవత్సరాంతంలో ప్రారంభించనున్నట్టు సమాచారం.