ఆశా వర్కర్ల ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

post

ఈ పనికి ఇంత వేతనం అన్నట్లు కాకుండా, ఓ ఫిక్సడ్ శాలరీ ఇవ్వాలని ఆశావర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. మొన్న శుక్రవారం సుమారు ఓ వెయ్యి మంది వరకు ఉన్న ఆశావర్కర్లు ధర్నా ప్రారంభించారు. తమకు సరైన వేతనాలివ్వాలన్న డిమాండు తో హైదరాబాద్ కోఠి లోని డైరెక్టరేట్ హెల్త్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. వారికి పీఎఫ్, మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కలిపించాలని వారి డిమాండ్లలో పేర్కొన్నారు. అయితే, ఈ ధర్నా కు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేసారు. ఇది ఇలా ఉంటె, ఈరోజు జగిత్యాల నుంచి కొంతమంది ఆశా వర్కర్లు అక్కడి నుంచి అసెంబ్లీ ని ముట్టడించడానికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో వారిని జగిత్యాల వద్దే కట్టడి చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. జిల్లాలో అన్ని కేంద్రాల్లో, ఉదయాన్నే పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు జగిత్యాల వద్ద ఓ ముప్పై మంది ఆశా వర్కర్లను అరెస్ట్ చేసారు.