ఔరా..! చికెన్ బదులు పనస బిర్యానీనా..!

post

కరోనా వైరస్ దేశం లో కూడా విస్తరిస్తున్న నేపధ్యం లో ప్రజలు చికెన్, మటన్ లను తినడానికి కూడా భయపడుతున్నారు. దేశం లో కూడా దాదాపు 70 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. చైనా ఫుడ్ వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది. అవి చైనా నుంచి దిగుమతి కావని తెలిసిన, ప్రజలు అనుమానం తో వాటి జోలికే పొవట్లేదు. కరోనా వైరస్ అంటువ్యాధి కాదని, తుంపర్లు లేదా లాలాజలం వల్ల వ్యాపిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహనా చర్యలు చేపట్టింది.

     ఏవి ఎలా ఉన్నా, ప్రజలు దాదాపుగా చికెన్ కు మటన్ కు దూరం గా ఉంటున్నారు. వాటి వల్ల ఈ వైరస్ రాదని తెలిసినా, వస్తుందేమో అన్న భయం వల్ల వారు దూరం గా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటె, చికెన్ మటన్ లకు ప్రత్యామ్నాయ ఆహార పదార్ధాల కోసం చూస్తున్నారు. చాల మంది జాక్ ఫ్రూట్ (పనస) మేలు చేస్తుందని భావించడం తో అందరు వాటిని విరివి గా కొనడం మొదలెట్టారు. దీనితో ఒక్కసారిగా పనస కు డిమాండ్ పెరిగిపోయింది. కిలో యాభై రూపాయలు ఉండే పనస పండు ఇపుడు నూట ఇరవై రూపాయలకు చేరుకుంది. చికెన్ ధర యాభై రూపాయలకి పడిపోయిన సంగతి తెలిసిందే.

పనస తోనే బిర్యానీ..!

నాన్ వెజ్ కి దూరం గా ఉంటున్న వారంతా ఒక్కసారిగా పనస పండు మీద పడ్డారు. పనస తోనే చికెన్ మటన్ బిర్యానీలను తయారు చేస్తున్నారు. కోరిన వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో పనస పండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందని, ఇది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందని, మంచి జుట్టును ఇస్తుందని చెప్తున్నారు. ఇది జీర్ణశక్తిని మెరుగు పర్చడానికి కూడా ఉపయోగపడుతుందని, పనసతో వెరైటీ వంటకాలు మొదలెట్టేసారు. చికెన్ మటన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదని ఎంతమంది డాక్టర్లు, పోషకాహార నిపుణులు చెప్తున్నా ఎవరు వినిపించుకోవడం లేదు. అనుమానం తో నాన్ వెజ్ కు దూరం గా ఉంటున్నారు.