యోగి సర్కార్ కు సుప్రీం షాక్..!

post

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లుకు కారకులంటూ లక్నోలో కొంతమంది వ్యక్తుల హోర్డింగ్ లను ఏర్ఫాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు అలహాబాద్ హై కోర్టుకు వెళ్లడం వారికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది.అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీలు చేసింది.. ఈ అపీలుపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అనిరుద్ధ బోస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఉత్తర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్ వాదనలు వినిపించారు అయితే పోలీసుల చర్య సమర్థనీయం కాదని సుప్రీం కోర్టు చెప్పింది.ఇటువంటి హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని జస్టిస్ యూయూ లలిత్ ప్రశ్నించారు. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా మించి ఏదైనా చేయవచ్చునా? అని నిలదీసారు. పోలీసుల చర్య ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సమర్థనీయం కాని రీతిలో జోక్యం చేసుకోవడమేనన్న ధర్మాసనంఈ హోర్గింగ్ లను  వెంటనే తొలగించాలని ఆదేశించింది.