ఎస్ బీ ఐ ఖాతాదారులకు ఊరట..!

post

ఎస్ బీ ఐ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త. వారు ఇకపై తమ పొదుపుఖాతాల్లో ఖాతాదారులు తమ పొదుపు ఖాతాల్లో ఉంచవలసిన నెలవారీ సగటు నిల్వ (ఏఎంబీ) నిబంధనను ఎస్‌బీఐ ఎత్తివేసింది. ఇప్పటివరకు మెట్రో నగరాల్లో ఎస్‌బీఐ కస్టమర్లు తమ ఖాతాలో కనీస నిల్వ రూ.3,000, సెమీ అర్బన్‌ కస్టమర్లు రూ.2,000, గ్రామీణ కస్టమర్లు రూ.1,000 కలిగి ఉండాలి. నెలవారీగా సగటు నిల్వ లేని పక్షంలో కస్టమర్లకు రూ.5 నుంచి రూ.15 వరకు బ్యాంకు జరిమానా విధిస్తూ వచ్చింది.  ఎస్‌బీఐ 2017 ఏప్రిల్‌ నుంచి కనీస నిల్వ చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ కనీస నిల్వ పెనాల్టీగా కస్టమర్ల నుంచి రూ.2,400 కోట్లకు పైగా వసూలు చేసింది. . అయితే .కస్టమర్‌ ఫస్ట్‌’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.   దీని వల్ల 44.51 కోట్ల మంది సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు జరిమానా బెడద తగ్గుతుంది.
జరిమానాగా రూ.10,000 కోట్లు..!
సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస నిల్వను ఉంచనందుకుగాను ఖాతాదారులు గత మూడేళ్లలో జరిమానాల రూపంలో బ్యాంకులకు దాదాపు రూ.10,000 కోట్లు చెల్లించారు. ఇందులో ప్రభుత్వరంగంలోని 18 బ్యాంకులు రూ.6,155 కోట్లు, నాలుగు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు రూ.3,567 కోట్లు వసూలు చేశాయి. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్స్‌ (బీఎ్‌సబీడీ), ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనా (పీఎంజేడీవై) ఖాతాల్లో నిల్వ లేనందుకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేయడం లేదు. ఇతర ఖాతాలకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నాయి.