నేటి నుంచి 'వింగ్స్ ఇండియా షో'..!

post

రెండేళ్ళకొకసారి వింగ్స్ ఇండియా షో ను నిర్వహిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. కాగా, ఈ ఏడాది కూడా ఈ ప్రదర్శన జరగనుంది. నేటి తో మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఇందుకోసం, బేగం పేట విమానాశ్రయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కలిసి 'వింగ్స్ ఇండియా 2020 ' షో ను సంయుక్తం గా నిర్వహిస్తున్నాయి.

      ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శనను మార్చి 13 వ తేదీన ముఖ్యమంత్రి లాంఛనం గా ప్రారంభించారు. అంతే కాకుండా, పౌరవిమానయాన రంగంలో చేసిన సేవలకుగాను వివిధ సంస్థలు, వ్యక్తులకు ఈ రోజున తాజ్ కృష్ణ హోటల్ లో అవార్డుల ప్రదానం జరగనుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎయిర్‌షోలు నిర్వహించనున్నారు.

కోవిద్-19 ప్రభావం ప్రదర్శనపై కూడా..!

      ప్రతి సారి పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించడానికి వచ్చేవారు. అయితే, కరోనా (కోవిద్-19 ) వైరస్ విస్తరిస్తుండడం తో ఈ సారి ఈ షో ను చూడటానికి ప్రజలకు అనుమతి లేదు. అంతే కాకుండా, విదేశీ ప్రతినిధులను కూడా తక్కువ సంఖ్యలో అనుమతించారు. ఈ వైరస్ వ్యాప్తి జరుగకుండా పౌరవిమానయానశాఖ, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. అంతే కాకుండా, విదేశీ ప్రతినిధులు కూర్చునే దూరాన్ని కూడా పెంచేలా ఏర్పాట్లు చేసాయి. ప్రపంచంలోని వివిధ కంపెనీలు హాజరవుతున్నందున.. వారిని పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు  ఇక్కడున్న వనరులు, పారిశ్రామిక విధానం, మరియు ఇతర వివరాలను కూడా తెలుపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.