'ప్రపంచ కిడ్నీ దినోత్సవం' ఈరోజే...!

post

ఒక వ్యక్తి ఆరోగ్యం గా బతకడానికి, జీవ క్రియలను సక్రమం గా నిర్వహించుకోవడానికి కిడ్నీ లు ఎంత అవసరమైనవో అందరికి తెలిసిందే. కాగా, మార్చి పన్నెండవ తేదీన ప్రపంచ వ్యాప్తం గా కిడ్నీ దినోత్సవం గా గుర్తించారు. కిడ్నీ ల గురించిన అవగాహన, వాటిని సంరక్షించుకోవాలిసిన అవసరం ప్రతి ఒక్కరికి తప్పని సరి గా ఉంది.

       ఇవి శరీరం మొత్తాన్ని శుచి గా ఉంచుతాయి. నిరంతరం రక్తం లోని వ్యర్ధాలను గడ్డకట్టి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అందుకే, మనం చలాకీగా ఇష్టం వచ్చిన తిండి తిని, హుషారు గా తిరుగగలుగుతున్నాం. ఒక్కోసారి, మనం తినే పదార్ధాల వాళ్ళ కిడ్నీలపై (మూత్రపిండాలపై) వత్తిడి పడుతుంది. దీనివలన, అవి సక్రమం గా పని చేయలేవు. అవి పనిచేయకపోతే జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. ఆకలి మందగిస్తుంది. మొత్తం శరీర ఆరోగ్య వ్యవస్థే అస్తవ్యస్తమైపోతుంది. అందుకే, వీటి గురించిన అవగాహన, వీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది.

       ప్రపంచ వ్యాప్తం గా ప్రతి వంద మందిలో నలభై మంది కి కిడ్నీ సంబంధిత అనారోగ్యం ఉంటోంది. కొంతమందికి జన్మతహా ఒకటే కిడ్నీ ఉండటం, లేదా రెండు ఉన్నా, ఒకటి పని చేయకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి.

కిడ్నీలు ఏమి చేస్తాయి..?

కిడ్నీలు రక్తం, రక్తంలోని పదా ర్థాలను శుభ్రపరుస్తాయి. రక్తం లోని అవసరమైన సోడియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫేట్‌ లవణ పోషకాలను మాత్రం శరీరానికి అందిస్తాయి. పిల్లల్లో సాధారణంగా నాలుగు సెంటీమీటర్లు, పెద్దలలో 9-12 సెంటీమీటర్లు సైజులో, చిక్కుడు గింజల ఆకారం లో ఈ కిడ్నీలు ఉంటాయి. రక్తపోటు నియంత్రణ హార్మో న్‌ అయినా రెనిన్ ను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఆమ్ల క్షార సమతుల్యతను కాపాడడంలోను ఇవి సాయం చేస్తాయి. అందుకే, ఇవి లేకపోతె మనిషి ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది.

ఎందుకు పాడవుతాయి..?

 సాధారణంగా వాడే బిపి, నొప్పుల మాత్రలు, స్టెరాయిడ్లు, పలు రకాల మందుల వాడకం వల్ల రక్తం లో ఇన్ఫెక్షన్ చేరి కిడ్నీలు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పాముకాటు, విషజ్వరాలు, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ వల్ల కూడా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల తద్వారా బిపి పెరగటం, రక్తం తయారు కాకపోవటం, శుద్ధి చేయలేకపోవటం, శరీరంలో మలినాలు ఎక్కువై నీరు చేరటం, అమ్ల క్షార సమతుల్యత దెబ్బతినటం వంటి అనర్ధాలు వస్తాయి. ఫలితం గా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చి మనిషి కోమా లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

ఖరీదైన చికిత్సలు..!

కిడ్నీ సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తుతానికి ఆధునికమైన వైద్యం అందుబాటులో  ఉంది. పుట్టుకతోను, జన్యుపరంగాను, ఇన్ఫెక్షన్ తోనూ వచ్చే కిడ్నీ జబ్బులను మందులతోనే అందుబాటులో ఉంచవచ్చు. కిడ్నీ మార్పిడి ద్వారా కూడా ఫెయిల్ అయినా కిడ్నీ సమస్యలను అధిగమించవచ్చు. పరిస్థితి చేయి దాటినా పక్షము లో డయాలసిస్ ద్వారా కూడా చికిత్స అందించవచ్చు. పెరిటోనియల్‌ డయాలసిస్‌' ద్వారా కిడ్నీ పాడైన వ్యక్తి బొడ్డు నుంచి ట్యూబ్‌ వేసి డయాలసిస్‌ ఫ్లూయిడ్ల ద్వారా చికిత్స అందిస్తారు. వారంలో రెండు మూడు సార్లు చేయించుకోవాల్సి వుంటుంది. ఈ చికిత్సను ఇంటి వద్ద కూడా చేస్తారు. 'హీమో డయాలసిస్‌'. వైద్యుల పర్యవేక్షణలోనే చేస్తారు. ఇందులో రక్త నాళాల ద్వారా మిషన్‌ ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తారు. రోజుకు రెండు, మూడు సార్లు చేయించాల్సి వస్తుంది. కిడ్నీ మార్పిడి వైద్యం ప్రస్తుతం అందుబాటులోనే ఉంది. ఇది మనిషికి పునర్జన్మని ఇస్తుంది. ప్రస్తుతం అన్ని చోట్ల, కిడ్నీ మార్పిళ్లపై అవగాహన కూడా పెరిగింది. కాకపోతే, వీటి చికిత్సలు అన్ని ఖరీదుతో కూడుకున్నవి. ప్రస్తుతం ఆరో గ్య, ఆరోగ్య దాన్‌ వంటి ప్రభుత్వ, ప్రభుత్వేర ట్రస్టుల ఆధ్వర్యంలో కూడా వైద్యం అందుబాటులో వుంది

ఎలా గుర్తించాలి...?

రక్త పరీక్షలు, క్రియా టినిన్‌, యూరియా, అల్ట్రా సౌండ్‌, ఎం.ఆర్‌.ఐ, సిటి స్కాన్‌, ఐ.వి.పి, ఐసోటో వరినోగ్రామ్‌ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారపు అలవాట్లు, నీళ్లు సరిపాళ్లలో తీసుకోక పోవటం, జనరిక్‌ సమస్యల వల్ల కిడ్నీ లో రాళ్ళూ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవి కిడ్నీ ఫంక్షన్ ను అడ్డుకుంటాయి. అందువల్ల ఈ అలవాట్ల విషయం లో జాగ్రత్తగా  ఉండాలి.