తెలంగాణ లో హెఫా ఫిల్టర్లు..!

post

దేశం లోను కరోనా వైరస్ కేసు లు నమోదు కావడం తో, తెలంగాణ ప్రభుత్వం హై అలెర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి కి పలు చర్యలు తీసుకోవడం తో పాటు, ప్రజలను భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మొన్న మధ్య ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్లు గా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా అనుమానితులుగా నమోదు చేసుకున్న పేషంట్లకు నెగటివ్ రిపోర్ట్ లు వచ్చినట్లు ఆరోగ్య మంత్రి ఈటెల స్పష్టం చేసారు. కాగా, ఇటలీ నుంచి మహేంద్ర హిల్స్ వ్యక్తి కి ఒకసారి పాజిటివ్ వచ్చి, మరోసారి నెగటివ్ రావడం తో కొన్ని రోజులు ఆబ్సెర్వేషన్ లో ఉంచి మరల టెస్ట్ చేసారు. నెగటివ్ రావడం తో, తెలంగాణ లో కరోనా లేదని స్పష్టం చేసారు. అయినప్పటికీ, కరోనా వైరస్ రాష్ట్రము లోకి రాకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఎయిర్పోర్ట్ వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద స్క్రీనింగ్ టెస్ట్ లు చేయడం తో పాటు గా, మెట్రో, ఆర్టీసీ వంటి జనాభా తిరిగే చోట్ల ఎప్పటికప్పుడు కెమికల్స్ తో శుభ్రం చేయిస్తున్నారు. అంతే కాకుండా, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

వైరస్ లను పీల్చుకునే హెఫా ఫిల్టర్లు...!

    కెసిఆర్ ప్రభుత్వం ఓ నాలుగు హెఫా ఫిల్టర్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇవి గాలిలో ఉండే వైరస్ లను పీల్చుకుని, స్వచ్ఛమైన గాలిని బయటకి వదులుతూ ఎయిర్ ప్యూరిఫైయర్ లు గా పనిచేస్తాయి. వీటిని వ్యాధిగ్రస్తులు, అనుమానితులు ఎక్కువ గా తిరుగుతూ ఉండే గాంధీ ఆసుపత్రి తో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఉంచడం ద్వారా అక్కడి వారు తుమ్మినా దగ్గినా, ఈ హెఫా ఫిల్టర్లు గాలి లోని సూక్ష్మ క్రిములను, వైరస్ లను తీసుకుని బయటకు స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల వద్ద ఉంచాలని భావిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రము లో ఇంకా వ్యాధి విస్తరిన్చాలేదని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.