ఇటలీలో ఇరుక్కున్న భారత విద్యార్థులు..!

post

ఇటలీ లో కూడా కరోనా వైరస్ పడగ విప్పుతోంది. చైనా తరువాత ఆ స్థాయి లో మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఇటలీ ముందుంది. ఈ నేపధ్యం లో, అక్కడి నుంచి సొంత దేశాలకు వెళ్లాలనుకునే విదేశీయులకు కొత్త ఇక్కట్లు మొదలయ్యాయి. మన భారతీయులు కూడా విమానాశ్రయం లో నే చిక్కుకున్నారు.

కొత్త నిబంధనతో పాట్లు..!

 భారత్ తో సహా పలు దేశాలు తమ దేశం లోకి రావాలంటే కరోనా ఫ్రీ సర్టిఫికెట్ ను అడుగుతున్నాయి. వైరస్ సోకలేదనడానికి సాక్ష్యం గా ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. ఓ వైపు వైరస్ సోకిన వారిని కాపాడే ప్రయత్నం లో ఉన్న హాస్పిటల్స్ నుంచి ఈ ధ్రువ పాత్రలను పొందటం కష్టతరం గా ఉంది. ధ్రువ పత్రాలు లేకుండా వారు దేశం నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇటలీ లోని భారతీయ విద్యార్థులకు కూడా ఈ ధ్రువ పత్రాలు లేకపోవడం వల్లనే ఇక్కట్లు తప్పట్లేదు. వారు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. అటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కానీ, ఇటు ఎయిరిండియా కానీ ఈ విద్యార్థులకు బోర్డింగ్ పాస్ లు ఇవ్వడానికి అంగీకారం తెలుపలేదు. ప్రస్తుతం వీరు ఇటలీ విమానాశ్రయం వద్దనే ఉన్నారు. వసతి, భోజన సదుపాయం కూడా లేకుండా 24 గంటలనుంచి వేచి ఉన్నామని, తమను ఆదుకోవాలని, స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని వారు మోదీని కోరుతున్నారు.