ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..!

post

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది ఆర్టీసీ ఉద్యోగుల వారి డిమాండ్లను తీర్చాలని సమ్మె చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది.  రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ప్రశంసిస్తున్నారు.

   కాగా, 2020-21 సంవత్సరానికి గాను, కెసిఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కోసం వెయ్యికోట్లు కేటాయించింది. ఇంకా, ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పొడిగించింది. ఇంకా, సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కి ప్రత్యేకమైన బోర్డు ను ఏర్పాటు చేస్తామని సీఎం అసెంబ్లీ లో వెల్లడించారు. సమ్మె కారణం తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకం ప్రసూతి సెలవులతో పాటు గా, వారి డ్యూటీ రాత్రి ఎనిమిది గంటల లోపు ముగిసేలా చర్యలు తీసుకున్నారు.