కూలిన పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్...!

post

పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఎయిర్ఫోర్స్ వారి ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటన లో వింగ్‌ కమాండర్‌ నౌమాన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నెల 23 న పాకిస్థాన్ డే ను జరుపుకోనున్నారు. అందుకోసం రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రిహార్సల్స్ లో భాగం గా గాల్లోకి ఎగిరిన ఎయిర్ క్రాఫ్ట్ అమాంతం కుప్పకూలిపోయింది. కాగా, ఈ ప్రమాదాన్ని పాక్ అధికారులు అధికారికం గా ధ్రువీకరించారు. ఈ ఏడాది, ఫిబ్రవరి 12 న కూడా విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో, ఇది మూడవ ప్రమాదమని అక్కడి అధికారులు చెబుతున్నారు.